Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

చేయూత పెన్షన్‌ దరఖాస్తుల గడువు పొడిగించాలి

30-08-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు కార్తీక్‌ గౌడ్‌

సాంకేతిక సమస్యల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోతున్న అర్హులు

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న కొత్త చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువును మరో 15 రోజులు పొడిగించాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెన్షన్ల దరఖాస్తుకు ఆగస్టు 31 చివరి తేదీగ నిర్ణయించినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేక అనేకమంది వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. ​అవసరమైన ధ్రువపత్రాలు సమయానికి అందకపోవడం, ఆన్‌లైన్ కేంద్రాల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల వల్ల అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేవలం గడువు ముగిసిందనే కారణంతో ఒక్క అర్హుడు కూడా సామాజిక భద్రతా పథకానికి దూరం కాకూడదని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి సెప్టెంబర్ 15 వరకు గడువు పెంచాలని కోరారు. అదేవిధంగా గ్రామస్థాయిలో అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి, అర్హులందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

చేయూత పెన్షన్‌ దరఖాస్తుల గడువు పొడిగించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News