నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలంలోని అతిమ్యాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లా సమాఖ్య శిక్షకురాలు స్వప్న మాట్లాడుతూ మహిళలు పొదుపు అలవాటును పెంపొందించుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాల సద్వినియోగం, రుణాలను ఆదాయం పెంచే ఉపాధి అవకాశాలకు వినియోగించుకునే విధానాలపై మహిళలకు అవగాహన కల్పించారు.మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ మహిళల అభివృద్ధికి తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని, మహిళా సంఘాల సభ్యులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో సీసీ సాయిలు, వీఓఏ పిరయ్య, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి