Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:28 AM

195వ వారం జ్ఞానమాల కార్యక్రమం విజయవంతం

195వ వారం జ్ఞానమాల కార్యక్రమం విజయవంతం

195వ వారం జ్ఞానమాల కార్యక్రమం విజయవంతం
31-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా 195వ వారం కార్యక్రమాన్ని ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం, ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలోని అన్మగల్–హయత్‌నగర్ పాత జాతీయ రహదారి పక్కన ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జై భీమ్ అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (రిజిస్టర్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్ మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాలోని మహానీయుల విగ్రహాలను కేవలం జయంతులు, వర్ధంతుల సందర్భంగా మాత్రమే కాకుండా ప్రతిరోజూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ ఇల్లు, వాకిలిని సైతం వదిలి సమాజం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహనీయులు చేసిన త్యాగాల్లో కనీసం కొంతైనా మనం ఆచరణలో పెట్టి, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. ఆయన అందించిన ఓటు హక్కు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో విగ్రహ దాత బోడ నరసింహ, గంగని కిషన్, ఎర్ర చంద్రయ్య (కురుమ), సాయి కాలనీ పేస్టు చారి, చుంచు రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

195వ వారం జ్ఞానమాల కార్యక్రమం విజయవంతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News