Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

దేవాదాయ కార్యాలయంలో మద్యం బాటిల్.. గుట్కా ప్యాకెట్లు!

30-08-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయ కార్యాలయంలో దృశ్యాలపై భక్తుల ఆందోళన.. సమగ్ర విచారణకు డిమాండ్.

సూర్యాపేట: ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయానికి సంబంధించిన దేవాదాయ కార్యాలయంలో కనిపించిన కొన్ని దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. కార్యాలయం వెలుపల దేవాలయ, ధర్మాదాయ కార్యాలయం అని బోర్డు ఉండగా.. లోపల మద్యం బాటిల్, గుట్కా ప్యాకెట్లు, బట్టలు, వ్యక్తిగత సామగ్రి కనిపించడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరి అనుమతితో?

ఈఓ, చైర్మన్ వంటి బాధ్యతాయుత అధికారులు ఉపయోగించే గది, కుర్చీలు ఇతరుల వినియోగంలోకి ఎలా వచ్చాయి? ఆ గదిని ఎవరు కేటాయించారు? ప్రస్తుతం అక్కడ ఎవరు ఉంటున్నారు? వారికి అధికారిక అనుమతి ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యాలయంలోని సామగ్రి, రికార్డుల భద్రతపై కూడా భక్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈఓ పర్యవేక్షణ ఎక్కడ?

భక్తులు సమకూర్చిన బీరువాల్లో ఆలయానికి సంబంధించిన కీలక రికార్డులు, పత్రాలు ఉంటే వాటి భద్రతకు బాధ్యత ఎవరిది? కార్యాలయాన్ని ఇతరుల వినియోగానికి అనుమతిస్తే నిబంధనలు ఏమిటి? మద్యం బాటిల్, గుట్కా ప్యాకెట్లు అక్కడికి ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రానికి చెందిన అధికారిక కార్యాలయంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమగ్రంగా విచారించి వాస్తవాలను వెల్లడించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

దేవాదాయ కార్యాలయంలో మద్యం బాటిల్.. గుట్కా ప్యాకెట్లు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News