Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

ఎవరి రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం పట్టణ బంద్

30-08-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఎవరి ప్రయోజనాల కోసం ఈ పట్టణ బంద్ ప్రజలందరికీ తెలుసని కోదాడ పట్టణ కాంగ్రెస్ నాయకుడు రావెళ్ళ కృష్ణారావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంతంగా సాగిపోతున్న పట్టణ జీవనాన్ని అశాంతికి గురిచేస్తూ, ఎవరి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ బంద్ పిలుపునిచ్చారనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయని,

ఉదయం లేచింది మొదలు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యే సామాన్య, మధ్యతరగతి ప్రజలను, రెక్కాడితే గానీ డొక్కాడని చిరు వ్యాపారులను ఈ బంద్ తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు.రోజువారీ సంపాదనపై ఆధారపడే కుటుంబాలు వ్యాపారాలు లేక ఆర్థికంగా నష్టపోయాయని,

ఒకవైపు కోదాడ ఎమ్మెల్యే వందల కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిజాయితీగా పనిచేస్తుంటే.,మరొకవైపు ఈ అభివృద్ధిని ఓర్వలేకనే బంద్ పేరిట రాజకీయం చేస్తున్నారనే పట్టణ ప్రజలకు తెలుసని, గత బిఆర్ఎస్ హయాంలో ప్రతి పదవికి, పోస్టింగ్ కి ఎంతెంత వసూలు చేసినావో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని రావెళ్ల కృష్ణారావు అన్నారు.గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, మున్సిపల్ పాలకవర్గం ఎలాంటి నియంతృత్వం,ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు.

ఇలాంటి ప్రశాంత వాతావరణంలో,వేగంగా అభివృద్ధి చెందుతున్న కోదాడలో బంద్ నిర్వహించి సాధారణ ప్రజలను, చిరు వ్యాపారులను విసిగించడం ఏ రకమైన రాజకీయమని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రావెళ్ల అన్నారు.స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల రవాణాను, రోజువారీ పనులను అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు.

Sthanikam

ఎవరి రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం పట్టణ బంద్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News