Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

ఆపదలో ఆపన్నహస్తం.. షబానా అజీమ్

ఆపదలో ఆపన్నహస్తం.. షబానా అజీమ్

ఆపదలో ఆపన్నహస్తం.. షబానా అజీమ్
30-08-2026 481 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మృతుడి తల్లి అనారోగ్యంపై వెంటనే స్పందన.. సొంత వాహనంలో నల్గొండకు తరలింపు.

చిట్యాల: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్. తాజాగా తన కుమారుడి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఓ కుటుంబానికి ఆమె అండగా నిలిచారు.రెండో వార్డుకు చెందిన గూడపూరి రాణి, గూడపూరి మహేందర్ దంపతుల కుమారుడు ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కుమారుడి మృతిని జీర్ణించుకోలేక తల్లి గూడపూరి రాణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

విషయం తెలుసుకున్న కౌన్సిలర్ షబానా అజీమ్ వెంటనే స్పందించి రాణిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం నల్గొండకు తరలించాలని సూచించారు.దీంతో పరిస్థితి తీవ్రతను గుర్తించిన షబానా అజీమ్ తన సొంత వాహనంలోనే రాణిని నల్గొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రాణికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.మానవత్వమే నిజమైన ప్రజాసేవ ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా, ఆపదలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహాయం అందిస్తూ షబానా అజీమ్ చూపుతున్న సేవాభావంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు, అనారోగ్యంతో ఉన్న మహిళను స్వయంగా ఆసుపత్రికి తరలించడం ఆమె మానవతా దృక్పథానికి నిదర్శనమని స్థానికులు పేర్కొన్నారు.

Sthanikam

ఆపదలో ఆపన్నహస్తం.. షబానా అజీమ్

Article Image

మీ స్పందన? 10 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News