Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:30 PM

క్రీడాకారులను ప్రోత్సహించడం అందరి బాధ్యత:అడిషనల్ కలెక్టర్ పాండు

29-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి కార్యక్రమాన్ని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ పాండు హాజరై మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థులకు కేవలం వినోదం మాత్రమే కాదని, మానసిక ఆరోగ్యం, ఉల్లాసం, ఆహ్లాదంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. నేషనల్ ప్లేయర్ మహమ్మద్ జావిద్ అలీ మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా ప్రతిభను, హాకీ రంగంలో భారతదేశానికి ఆయన అందించిన సేవలను వివరించారు. మరో గౌరవ అతిథి కూన వేణు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి ధ్యాన్ చంద్ స్ఫూర్తితో దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియాలో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన కొర్రరాజు, జాడో చరణ్, కె. గీతలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ హాకీ కోచ్ సాయికుమార్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బి. శంకర్, రెజ్లింగ్ కోచ్ జైపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు దుర్గ ప్రసాద్, సుభాష్ గౌడ్, రామకృష్ణ, రామ గౌడ్, కృష్ణయ్య, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్, కరాటే అసోసియేషన్ చవాన్ చందర్, బాక్సింగ్ అసోసియేషన్ మహేష్, రెజ్లింగ్ అసోసియేషన్ విట్టల్ నాయక్‌తో పాటు ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

క్రీడాకారులను ప్రోత్సహించడం అందరి బాధ్యత:అడిషనల్ కలెక్టర్ పాండు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News