Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సిపిఎం పార్టీ పోరాట ఫలితమే నేడు రైతులకు భూమి పట్టాలు ;మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:10 PM

శాసనమండలి చైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు...

29-08-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

గీత దాటిన వారిపై వెంటనే వేటు వేయాలి...

ఉచితాలు తగ్గించి.. ఉద్యమకారులకు న్యాయం చేయాలి...

మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన సుఖేందర్‌రెడ్డి...

నల్లగొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నడుచుకోవాల్సిన తీరుపై తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నల్లగొండలో విలేకరులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో క్రమశిక్షణే పరమావధిగా ఉండాలని, గీత దాటి వ్యవహరించే వారిపై క్షణమైనా ఆలస్యం చేయకుండా వెంటనే వేటు వేయాలని స్పష్టం చేశారు. లేకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని హెచ్చరించారు.

క్యాబినెట్‌లో మార్పులు అవసరం...

ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపడటానికి క్యాబినెట్‌లో, పాలనా వ్యవస్థలో తగిన మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని గుత్తా అభిప్రాయపడ్డారు. పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలకు తక్షణమే స్వస్తి చెప్పాలని, స్థానిక క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తిని సమతుల్యం (బ్యాలెన్స్) చేస్తూ ముందుకెళ్లాలని సూచించారు.

ఉచితాలు తగ్గించాలి పెన్షన్లు పెంచాలి...

ప్రజా సంక్షేమంపై మాట్లాడుతూ.. ఉచిత పథకాల మోజు తగ్గించి, నిజమైన లబ్ధిదారులకు మేలు జరిగేలా చూడాలని సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు రైతులకు ఇచ్చే రైతు భరోసా పథకాన్ని ఎలాంటి విఘాతం లేకుండా కొనసాగించాలి ప్రస్తుతం ఇస్తున్న సామాజిక పింఛన్లను రూ.4,000లకు పెంచాలి. నిషేధిత భూముల జాబితా అయిన ‘22A’ను వెంటనే రద్దు చేసి భూ సమస్యలకు పరిష్కారం చూపాలి. ​తెలంగాణ సిద్ధాంతకర్తలు, ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇచ్చి న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. వీటన్నింటినీ సమర్థవంతంగా అమలు చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Sthanikam

శాసనమండలి చైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News