మాతృభాష తెలుగు పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం కలిగి ఉండాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని భాషల్లో తెలుగు ఎంతో మధురమైనదని, పలువురు భాషావేత్తలు తెలుగు గొప్పతనాన్ని చాటిచెప్పారని అన్నారు. మాతృభాషను నిరాదరించకూడదని సూచించారు. తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ.. సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా వ్యవహారిక భాషలో రచనలు చేయాలని గిడుగు రామ్మూర్తి పంతులు ఉద్యమించారని తెలిపారు. తెలుగు భాష కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్.రత్నమంజుల, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనీలిమ, తెలుగు శాఖ అధ్యాపకులు అద్దంకి ఆంజనేయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి