Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

వేపచెట్టు వివాదం.. ఇద్దరి దారుణ హత్య!

వేపచెట్టు వివాదం.. ఇద్దరి దారుణ హత్య!

వేపచెట్టు వివాదం.. ఇద్దరి దారుణ హత్య!
29-08-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఇరువర్గాల మధ్య ఘర్షణలో తండా వాసుల మృతి.. అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్‌ఐపై రాళ్ల దాడి.

మేళ్లచెరువు: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో వేపచెట్టు విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న వేపచెట్టు వివాదం శనివారం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో అమరబోయిన వెంకటేశ్వర్లు, భూక్య సైదా దారుణ హత్యకు గురయ్యారు.

స్థానికుల సమాచారం ప్రకారం.. వేపచెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో భూక్య రాము గొడ్డలితో అమరబోయిన వెంకటేశ్వర్లుపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అనంతరం తన తండ్రి భూక్య సైదాపైనా గొడ్డలితో దాడి చేయడంతో ఆయన కూడా మృతిచెందినట్లు తెలుస్తోంది.

అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్‌ఐపై దాడి

ఘటన సమాచారం అందుకున్న మేళ్లచెరువు ఎస్‌ఐ నవీన్‌ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే క్రమంలో ఎస్‌ఐపై కూడా రాళ్లతో దాడి జరగడంతో ఆయన తలకు గాయమైంది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘర్షణలో పాల్గొన్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తండాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Sthanikam

వేపచెట్టు వివాదం.. ఇద్దరి దారుణ హత్య!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News