Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

డిజిటల్‌ వర్సిటీగా అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ.

28-08-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పూర్తిస్థాయి డిజిటల్‌ యూనివర్సిటీగా రూపాంతరం చెందుతోందని వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి తెలిపారు. యూనివర్సిటీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఉన్నత విద్యను అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతికత, ఆన్‌లైన్‌ విద్య, కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ‘ఏఐ ఫర్‌ టీచర్స్‌’ కోర్సులో శిక్షణ ప్రారంభించామని వెల్లడించారు. డిజిటల్‌, ఆన్‌లైన్‌ విధానంలో కోర్సులు నిర్వహించేందుకు యూజీసీ అనుమతి లభించిందన్నారు.

ఏఐతో విద్య మరింత సులభం

కామన్వెల్త్‌ ఎడ్యుకేషనల్‌ మీడియా సెంటర్‌ ఫర్‌ ఆసియా (సెమ్కా–న్యూఢిల్లీ) డైరెక్టర్‌ డా.బి.శడ్రక్‌ మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత స్వీయ అభ్యసనతో విద్యార్థులకు మరింత సౌలభ్యం కలుగుతుందన్నారు. రైతులు, గృహిణులు, ఉద్యోగులు తమ రోజువారీ బాధ్యతలను నిర్వహించుకుంటూనే విద్యను కొనసాగించవచ్చని తెలిపారు. డిజిటల్‌ సాంకేతికతతో భౌగోళిక, సామాజిక పరిమితులను అధిగమించి నాణ్యమైన విద్యను విస్తృతంగా అందించవచ్చన్నారు.

కార్యక్రమానికి అకాడమిక్‌ డైరెక్టర్‌ ప్రొ.జి.పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించారు. రిజిస్ట్రార్‌ డా.ఎల్‌.విజయ కృష్ణారెడ్డి, పలువురు అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

డిజిటల్‌ వర్సిటీగా అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News