Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:35 PM

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీల సీజ్

28-08-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు

141 టన్నుల ఇసుక స్వాధీనం, ఇద్దరు డ్రైవర్లపై కేసు

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఉదయం 8 గంటల ప్రాంతంలో మల్కాపురం గ్రామం పరిధిలో పోలీసులు, గనుల శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు.ఆ సమయంలో ఏపీ వైపు నుంచి వస్తున్న రెండు లారీలను ఆపి పరిశీలించగా, ఎలాంటి ఆధారాలు, అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ​AP 39WC 6179 లారీలో 69.77 టన్నుల ఇసుకను రవాణా చేస్తున్న డ్రైవర్ ఎస్.కె. బాబావలిని అదుపులోకి తీసుకున్నారు.AP 37UG 3889 లారీలో 71.49 టన్నుల ఇసుకను తరలిస్తున్న డ్రైవర్ జానీ భాషను పట్టుకున్నారు.మొత్తం 141.26 టన్నుల ఇసుకతో పాటు రెండు లారీలను సీజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ కే.రాఘవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Sthanikam

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీల సీజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News