Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:55 PM

జర్నలిస్టుల నేత కారింగుల అంజన్‌గౌడ్‌ జన్మదిన వేడుకలలో అన్నదానం...

27-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

రాష్ట్ర జర్నలిస్టుల నాయకులు కారింగుల అంజన్‌గౌడ్‌ జన్మదిన వేడుకలను కోదాడ పట్టణంలోని శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల ఆశ్రమంలో గురువారం ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ తోటపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశ్రమ పిల్లలతో కలిసి ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల సమక్షంలో వారి చేతుల మీదుగా కేక్‌ను కట్‌ చేశారు. పిల్లలకు కేక్‌ తినిపించి వారి ముఖాల్లో చిరునవ్వులు చిందించారు. అనంతరం ఆశ్రమంలోని వికలాంగులందరికీ ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ తోటపల్లి నాగరాజు మాట్లాడుతూ.. నిత్యం ప్రజా సమస్యలపై, సమాజహితం కోసం కలం పట్టే జర్నలిస్టులు.. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండడం అభినందనీయమన్నారు. సమాజంలో ఆపన్నులను ఆదుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఈ వేడుకలు నిర్వహించడం ద్వారా అంజన్‌గౌడ్‌ ఆశయానికి తగినట్లుగా మంచిని చాటుకున్నారని కొనియాడారు. తోటి జర్నలిస్టుల ఆప్యాయతానురాగాల మధ్య జరిగిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణానికి చెందిన పలువురు ప్రముఖ జర్నలిస్టులు కుడుముల సైదులు, సన్నీరు మురళి, నజీర్ , గంధం వెంకటనారాయణ, చెరుకుపల్లి శ్రీకాంత్, దామోదర్ , సంపత్, శ్రీనివాస్, వాసు, శేఖర్ సునీల్ , రంగా ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టుల నేత కారింగుల అంజన్‌గౌడ్‌ జన్మదిన వేడుకలలో అన్నదానం...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News