నవరాత్రుల సందర్భంగా సదాశివపేట పట్టణంలోని చాపలకేరి శ్రీ మహంకాళి మందిరంలో 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ మహంకాళి మాత అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమివ్వగా, మమత రాజు దంపతులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు రాకేష్ పంతులు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఇట్టి సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ దేశంలో ఏలినో ప్రభావం వలన వర్షాలు పడడం లేదని, నీళ్లులేక పాడి పంటలు ఎండిపోతున్నాయని, తాగునీరు రోజు రోజుకు తగ్గిపోతుందని, అమ్మ మా దేశ ప్రజలను సుబిక్షంగా ఉంచమ్మ, వర్షాలు కురిపించమ్మా, ప్రజలను చల్లగా చూడమ్మా, కరువునుండి కాపాడమ్మా అని పులిమామిడి రాజు అమ్మవారిని వేడుకున్నారు. ఇంత భక్తితో కొలిచే నిన్ను నిమజ్జనం చేయాలంటే చెరువుల్లో నీళ్లు లేవమ్మా, కరుణించమ్మ కాపాడమ్మా, నీ యొక్క నిమజ్జనంలోపు వర్షాన్ని కురిపించి నువ్వు ఉన్నావని నిరూపించుకొమ్మని ఆ మహంకాళి మాతను, అన్న పూర్ణమాతను సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు వేడుకున్నారు. సదాశివపేట అంటేనే ఎల్లప్పుడు ఆ సదాశివుడు నివసించే ప్రాతం అని పులిమామిడి రాజు అన్నారు. ఇక్కడ ఉన్నన్ని దేవాలయాలు ఏ గ్రామంలో లేవని అన్నారు. అనంతరం పులిమామిడి మమత రాజు దంపతుల ఆధ్వర్యంలో ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి నిర్వహించిన భజన కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మార్మోగింది.
ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ వైద్యం గోపి ప్రియాంక పవన్ మరియు శ్రీ మహంకాళి దేవాలయ అధ్యక్షులు నల్ల సుధాకర్, ప్రధాన కార్యదర్శి నల్ల శంకర్, కార్యవర్గ సభ్యులు చాపల హన్మంతు, జనార్ధన్, బంటు రవి, పద్మ మాణిక్యం, సాతాని నరేందర్, మహేష్, అఖిల్, నాగరాజు, రాగం అనిల్, తాలెల్మ రాము, సోమ శంకర్ తదితరులతో పాటు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి