Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కన్నులపండువగా నవరాత్రి ఉత్సవాలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 09:09 PM

​శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కన్నులపండువగా నవరాత్రి ఉత్సవాలు!

14-10-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చండీదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు.. భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలు

చౌటుప్పల్ భవానీనగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు చండీదేవి అవతారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

​గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చౌటుప్పల్ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణం, అష్టోత్తర శతనామావళి పూజలు భక్తిశ్రద్ధలతో గావించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెన్ రెడ్డి సంధ్య, డాక్టర్ ఉజ్జీనీ మంజుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులు మాట్లాడుతూ.. రామాలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ శరన్నవరాత్రి వేడుకల్లో చౌటుప్పల్‌లోని మహిళా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గాదేవి దివ్యాశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ధర్మకర్తల మండలి చైర్మన్ బొబ్బిళ్ళ మురళి గురుస్వామి, నాయకులు వర్కల రవి గౌడ్, ఆవుల యేసు యాదవ్, గుగులోతు అరుణ, మహిళా భక్తులు పెద్ది స్వాతి, కిషోర్ శర్మ, చింతల కరుణ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సభ్యులు పోలోజు శ్రీలత, ముటుకులోజు నీరజ, వనం మమత, సురోజు శోభారాణి, జూకంటి రేవతి, నిమ్మల అండాలు, మామిడి వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

​శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కన్నులపండువగా నవరాత్రి ఉత్సవాలు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News