Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విధుల్లో ప్రతిభకు గుర్తింపు.. ప్రేమ్ కుమార్‌కు ప్రశంసా పత్రం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 10:08 PM

తప్పిపోయిన ఆరేళ్ల బాలిక క్షేమం. సరూర్‌నగర్‌ పోలీసుల చాకచక్యం.. గంటల్లోనే ఆచూకీ గుర్తింపు!

14-10-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డయల్‌ 100కు ఫోన్‌ రావడంతో తక్షణ స్పందన.

భగత్‌సింగ్‌ నగర్‌లో తప్పిపోయిన ఆరేళ్ల బాలికను సరూర్‌నగర్‌ పోలీసులు సురక్షితంగా గుర్తించారు. బుధవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో అనీషా అనే బాలిక తప్పిపోయినట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డయల్‌ 100కు వచ్చిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల సమన్వయంతో సరూర్‌నగర్‌లోని సాయినగర్‌ వద్ద బాలిక ఆచూకీ గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ

బాలిక తప్పిపోయిన ఘటనపై ఎల్బీనగర్‌ డీసీపీ అనురాధ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎల్బీనగర్‌ ఏసీపీ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం గాలింపు చర్యలను పర్యవేక్షిస్తూ సమన్వయం చేసింది. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు పోలీసులు వేగంగా స్పందించి బాలిక ఆచూకీ గుర్తించడంతో చిన్నారి సురక్షితంగా లభించింది.

సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి

ప్రజల భద్రతతోపాటు చిన్నారుల రక్షణకు పోలీసులు ప్రాధాన్యమిస్తారని అధికారులు తెలిపారు. ఎవరైనా తప్పిపోయిన సందర్భాల్లో ఆలస్యం చేయకుండా డయల్‌ 100 లేదా 112కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

Sthanikam

తప్పిపోయిన ఆరేళ్ల బాలిక క్షేమం. సరూర్‌నగర్‌ పోలీసుల చాకచక్యం.. గంటల్లోనే ఆచూకీ గుర్తింపు!

Article Image

డయల్‌ 100కు ఫోన్‌ రావడంతో తక్షణ స్పందన.

భగత్‌సింగ్‌ నగర్‌లో తప్పిపోయిన ఆరేళ్ల బాలికను సరూర్‌నగర్‌ పోలీసులు సురక్షితంగా గుర్తించారు. బుధవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో అనీషా అనే బాలిక తప్పిపోయినట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డయల్‌ 100కు వచ్చిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల సమన్వయంతో సరూర్‌నగర్‌లోని సాయినగర్‌ వద్ద బాలిక ఆచూకీ గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ

బాలిక తప్పిపోయిన ఘటనపై ఎల్బీనగర్‌ డీసీపీ అనురాధ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎల్బీనగర్‌ ఏసీపీ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం గాలింపు చర్యలను పర్యవేక్షిస్తూ సమన్వయం చేసింది. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు పోలీసులు వేగంగా స్పందించి బాలిక ఆచూకీ గుర్తించడంతో చిన్నారి సురక్షితంగా లభించింది.

సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి

ప్రజల భద్రతతోపాటు చిన్నారుల రక్షణకు పోలీసులు ప్రాధాన్యమిస్తారని అధికారులు తెలిపారు. ఎవరైనా తప్పిపోయిన సందర్భాల్లో ఆలస్యం చేయకుండా డయల్‌ 100 లేదా 112కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News