విద్యార్థులు, యువతకు విజ్ఞాన భాండాగారం గ్రంథాలయం: చైర్మన్ కొండ శేఖర్.
గ్రామ అభివృద్ధిలో గ్రంథాలయాల పాత్ర కీలకం: సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్.
చిట్యాల: మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని గ్రంథాలయ చైర్మన్ కొండ శేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించే కేంద్రాలని, విద్యార్థులు, యువత భవిష్యత్తుకు బాటలు వేసే విజ్ఞాన భాండాగారాలని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని, పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు లక్ష్యాలను సాధించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు, యువత గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో గ్రంథాలయం అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి, యువతలో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. విద్యార్థులు, యువతతో పాటు గ్రామ ప్రజలందరూ గ్రంథాలయాన్ని వినియోగించుకొని విద్యా, విజ్ఞాన రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గ్రామంలో విద్యాభివృద్ధికి, యువతకు అవసరమైన సదుపాయాల కల్పనకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలో నూతన గ్రంథాలయం ప్రారంభం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆవుల రమేష్, విపంచ ఫౌండేషన్ చైర్మన్ ఏ. శ్రీనివాస్ రెడ్డి, రుద్రరపు లక్ష్మణ్, రొండి నరసింహ, దేశపాక మధు, పల్లపు ప్రశాంత్, సత్యనారాయణ, బెల్లంకొండ రఘు, ఆకుల వెంకన్న, రొండి వెంకన్నతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి