అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కౌటికె విఠల్, కావ్య దంపతులు
చౌటుప్పల్‌లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో 'దేవీ శరన్నవరాత్రి' ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా తొలి పూజా కార్యక్రమాన్ని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు కౌటికె విఠల్, కావ్య దంపతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, మాజీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఐవీఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వేడుకల్లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చకిలం రమణయ్య, సీనియర్ సిటిజన్ ఫోరం తెలంగాణ రాష్ట్ర మాజీ కార్యదర్శి సింగిరికొండ నరసింహ, సీనియర్ సిటిజన్ ఫోరం తెలంగాణ రాష్ట్ర మాజీ కోశాధ్యక్షుడు, ప్రాజెక్టు చైర్మన్ శ్రీకాకుళపు చలపతిరావు,ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ న్యాయ సలహాదారు, ఏవీఓపీఏ హైదరాబాద్ అధ్యక్షుడు మధుపల్లి రవి గుప్తా, కొండూరు శ్రీనివాస్, షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దిల్సుఖ్‌నగర్ మాజీ చైర్మన్ వూర నరసింహ, కర్నాటీ వెంకటేశ్వర్లు, కైలాస శ్రీనివాస్, ఐవీఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, వాసవి మాత మందిర ఉపాధ్యక్షులు శంభు పండయ్య, షిరిడీ తులసి భవన్‌కు చెందిన పలువురు ట్రస్టీలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి