హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన 5వ తెలంగాణ బ్యాడ్మింటన్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా పోలీసు సిబ్బంది ప్రతిభ చాటారు. 50 ఏళ్లకు పైబడిన వయస్సు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఈ.డి. సజీవ్ బంగారు పతకం సాధించగా, మహిళల ఓపెన్ డబుల్స్ విభాగంలో శ్రావ్య, ధరణి కాంస్య పతకం సాధించారు. పతకాలు సాధించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ శాలువాతో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా క్రీడాకారులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్ పాల్గొన్నారు.
PRINT TIME: October 03, 2026 08:13 PM
తెలంగాణ పోలీస్ బ్యాడ్మింటన్ పోటీల్లో సంగారెడ్డి పోలీసుల మెరుపు

03-10-2026
91 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన 5వ తెలంగాణ బ్యాడ్మింటన్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా పోలీసు సిబ్బంది ప్రతిభ చాటారు. 50 ఏళ్లకు పైబడిన వయస్సు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఈ.డి. సజీవ్ బంగారు పతకం సాధించగా, మహిళల ఓపెన్ డబుల్స్ విభాగంలో శ్రావ్య, ధరణి కాంస్య పతకం సాధించారు. పతకాలు సాధించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ శాలువాతో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా క్రీడాకారులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్ పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి