సామాజిక సమస్యలపై తన కలంతో నిరంతరం పోరాడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత కట్టెల లింగస్వామిని చౌటుప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. 'కలం కవాతు' పుస్తక రచన ద్వారా సమాజంలోని పలు సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ, ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తున్న ఆయన సేవలను ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ప్రశంసించారు.కోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ... అనేక సామాజిక ఉద్యమాల్లో ముందుండి నడిచిన కట్టెల లింగస్వామి, భవిష్యత్తులో మరిన్ని గొప్ప కవితలు, సాహిత్య రచనలు చేసి సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు పరమేష్, ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పిట్టల భిక్షమయ్య, జాయింట్ సెక్రెటరీ మక్తాల నరసింహ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పిల్లలమర్రి కిరణ్, జ్యోతి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఊడుగు శ్రీనివాస్ గౌడ్, బాల్యం వెంకటాచలపతి, సీనియర్ న్యాయవాదులు ముత్యాల సత్తిరెడ్డి, ఎస్.ఆర్. భిక్షపతి, బడుగు శ్రీకాంత్, చామట్ల జంగయ్య, పాల పరమేశ్, జక్కర్తి శేఖర్, జెల్లా రమేష్, పిట్టల భరత్, శ్రీకాంత్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
రచయిత కట్టెల లింగస్వామికి ఘన సన్మానం… కొనియాడిన చౌటుప్పల్ బార్ అసోసియేషన్!

K.RAVI

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి