Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. అక్టోబర్ 10 నుంచి తరగతులు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 08:08 PM

తూప్రాన్‌పేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

03-10-2026 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై తూప్రాన్‌పేట్‌ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ​బాధితుల కథనం ప్రకారం... నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన కాడింగు యాదగిరి (26), తన స్నేహితులు రాచకొండ గణేష్ (28), కొరివి జగదీష్ (27)లతో కలిసి చేపల వ్యాపారం నిమిత్తం కారులో ( టి ఎస్ 05 యు ఎఫ్ 7327) ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వైపు బయలుదేరారు. కారును జగదీష్ నడుపుతున్నాడు.​తెల్లవారుజామున సుమారు 3:00 గంటల సమయంలో తూప్రాన్‌పేట్‌లోని రంగమ్మ గారి కిచెన్ హోటల్ ఎదురుగా వీరు ప్రయాణిస్తున్న కారు చేరుకుంది. అదే సమయంలో వీరి ముందు వెళ్తున్న డిసిఎమ్ ( టి ఎస్ 06 యు బి 6008) వాహన డ్రైవర్ తాళ్ల నిరంజన్ అతివేగంగా, అజాగ్రత్తగా ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా అకస్మాత్తుగా ఎడమ వైపు నుంచి కుడి వైపునకు మళ్లించాడు. దీంతో వెనుక వస్తున్న కారు సడన్‌గా డిసిఎమ్‌ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది.​ఈ ప్రమాదంలో కారులో ఉన్న యాదగిరి, జగదీష్, గణేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితులను వెంటనే హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యాదగిరి మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.​మృతుని తండ్రి కడింగు ఉప్పలయ్య (54) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

తూప్రాన్‌పేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News