సంగారెడ్డి జిల్లా మానూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దసరా పండుగ సందర్భంగా శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని కుంటలో బట్టలు ఉతికేందుకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన మాటూరి నరసింహారెడ్డి (45), ఆయన భార్య కృష్ణవేణి (38),సంగారెడ్డి (43) కలిసి బట్టలు ఉతికేందుకు కుంట వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో సంగారెడ్డి నీటిలో మునిగిపోతుండగా, ఆయనను కాపాడేందుకు నరసింహారెడ్డి, కృష్ణవేణి ప్రయత్నించారు.అయితే నీటి లోతు తెలియకపోవడంతో ముగ్గురూ నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. అక్కడే ఉన్న నరసింహారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి గ్రామానికి చేరుకుని గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్‌ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించి,ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దసరా పండుగ వేళ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో మానూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి