నర్సింహులగూడెం గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మునగాల మండల పరిధిలోని రేపాల సబ్‌స్టేషన్‌ను గురువారం ముట్టడించారు. వర్షాలు లేక వరి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, కనీసం బోరుబావుల ద్వారా పంటలకు నీరు అందించుకునే అవకాశం కల్పించాలని రైతులు కోరారు.
ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పంటలను కాపాడుకునేందుకు బోరుబావులపై ఆధారపడుతున్న రైతులకు ప్రభుత్వం సరిపడా విద్యుత్ అందించకపోవడంతో మరింత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మొగిలిచెర్ల సీతారాములు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొంత స్వరూప, విజయలక్ష్మి, కొండారెడ్డి, వార్డు మెంబర్లు రమేష్, శివరాజు, ఖాసింఅలీ, నాగరాజు, రవీందర్ రెడ్డి, అలాగే సోమయ్య, బ్రహ్మం, వేణుగోపాలరెడ్డి, రాజశేఖరరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాంబాబు, మదార్ తదితర రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి