ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రుల ఓటు నమోదును విస్తృతంగా చేపట్టాలని కోదాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వంటిపులి వెంకటేష్ పిలుపునిచ్చారు. గురువారం మునగాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు..ప్రతి గ్రామం, వార్డులో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టి అర్హులందరూ ఓటు హక్కు పొందేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాలే సామెల్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెలపాటి సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పట్టభద్రుల ఓటు నమోదును వేగవంతం చేయాలి
పట్టభద్రుల ఓటు నమోదును వేగవంతం చేయాలి
Harish reporter
ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రుల ఓటు నమోదును విస్తృతంగా చేపట్టాలని కోదాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వంటిపులి వెంకటేష్ పిలుపునిచ్చారు. గురువారం మునగాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు..ప్రతి గ్రామం, వార్డులో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టి అర్హులందరూ ఓటు హక్కు పొందేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాలే సామెల్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెలపాటి సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి