కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి చేపట్టిన దీక్ష రెండో రోజూ కొనసాగింది. రాహుల్ గాంధీకి మద్దతుగా జగ్గారెడ్డి దంపతులు రాత్రింబవళ్లు దీక్షా వేదికపైనే నిరసన తెలిపారు. వారి దీక్షకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, సంగారెడ్డి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు.భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని, ఆయన ఉద్యమం కొనసాగినంతకాలం తమ నిరసన కూడా కొనసాగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో మరిన్ని సంఘీభావ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, జగ్గారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో రాహుల్ గాంధీకి మద్దతుగా జగ్గారెడ్డి దంపతుల దీక్ష

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి