Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:11 AM

చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు

చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు

చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు
09-10-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రోబోటిక్‌ టెక్నాలజీతో మరింత కచ్చితత్వం.. వేగంగా కోలుకునే అవకాశం.

యశోద ఆసుపత్రి థొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రోహన్‌రెడ్డి..

నల్గొండ: ఛాతీకి సంబంధించిన సంక్లిష్ట వ్యాధులకు ఆధునిక శస్త్రచికిత్స విధానాలతో మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చిందని సోమాజిగూడ యశోద ఆసుపత్రి థొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రోహన్‌రెడ్డి సి. తెలిపారు. వీడియో అసిస్టెడ్‌ థొరాసిక్‌ సర్జరీ (వీఏటీఎస్‌), రోబోట్‌ అసిస్టెడ్‌ థొరాసిక్‌ సర్జరీ (రాట్స్‌) వంటి ఆధునిక పద్ధతులతో చిన్న కోతల ద్వారానే శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర రెస్టారెంట్‌లో యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తక్కువ నొప్పి.. త్వరగా కోలుకునే అవకాశం.

థొరాసిక్‌ సర్జరీలో గత పదేళ్లుగా గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని డాక్టర్‌ రోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఛాతీని పూర్తిగా తెరిచి శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చేదని, ప్రస్తుతం అధునాతన సాంకేతికతతో చిన్న కోతల ద్వారానే చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ విధానాలతో శస్త్రచికిత్స అనంతరం నొప్పి, గాయం తగ్గడంతోపాటు ఆసుపత్రిలో ఉండాల్సిన సమయం కూడా తగ్గుతుందన్నారు. రోగులు త్వరగా కోలుకుని సాధారణ జీవనానికి చేరుకునే అవకాశం ఉంటుందని వివరించారు. రోబోటిక్‌ సాంకేతికతతో శస్త్రచికిత్సలను మరింత కచ్చితత్వంతో నిర్వహించవచ్చని తెలిపారు.

క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించాలి

ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్లను ప్రారంభ దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని డాక్టర్‌ రోహన్‌రెడ్డి తెలిపారు. ఊపిరితిత్తులు, అన్నవాహికతోపాటు ఛాతీ మధ్యభాగంలోని అవయవాలు, డయాఫ్రమ్‌, ఛాతీ గోడకు సంబంధించిన సంక్లిష్ట వ్యాధులకు ఆధునిక వైద్య విధానాలు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. థొరాసిక్‌ సర్జన్లు, పల్మోనాలజిస్టులు, ఆంకాలజిస్టులు, రేడియాలజిస్టులు, అనస్థీషియాలజిస్టులు, క్రిటికల్‌ కేర్‌ నిపుణులు సమన్వయంతో పనిచేయడం ద్వారా మెరుగైన చికిత్స ఫలితాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు.యశోద ఆసుపత్రిలో అధునాతన ఆపరేషన్‌ థియేటర్లు, హైడెఫినిషన్‌ ఇమేజింగ్‌ వ్యవస్థలు, రోబోటిక్‌ సర్జికల్‌ ప్లాట్‌ఫారమ్‌లతో ఛాతీ సంబంధిత వ్యాధులకు సమగ్ర వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభ దశలోని ఊపిరితిత్తుల క్యాన్సర్‌, అన్నవాహిక వ్యాధులు, ఛాతీలోని కణితులు, అత్యవసర సమస్యలకు మినిమల్లీ ఇన్వాసివ్‌ విధానాల్లో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి సీనియర్‌ మేనేజర్‌ ఉమేష్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News