Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 10:48 AM

సొంత నిధులతో గ్రామాభివృద్ధికి దూసుకెళ్తున్న యువ సర్పంచ్

25-12-2025 66,060 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న యువ సర్పంచ్

ప్రభుత్వం కాదు, సంకల్పమే బలం – సొంత ఖర్చుతో గ్రామాభివృద్ధి చేస్తున్న యువ సర్పంచ్

రామన్నపేట స్థానిక ప్రతినిధి

చేయాలనే తపన ఉంటే అభివృద్ధి ఆగదని బోగారం గ్రామ యువ సర్పంచ్ కునూరు సాయికుమార్ నిరూపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు.

పదవి లేనప్పుడే పుట్టిన ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రజల మధ్యే తిరుగుతూ సమస్యలను గుర్తించిన సాయికుమార్, సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే ఉత్సాహంతో పనులు వేగవంతం చేశారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఏండ్ల నాటి సమస్యగా మారిన వికాస్ ఫంక్షన్ హాల్ నుంచి ఆంజనేయస్వామి దేవాలయం వరకు ఉన్న గ్రామపంచాయతీ రహదారిని సొంత నిధులతో జేసీబీ ఏర్పాటు చేసి చెత్తాచెదారం తొలగించి చదును చేయించారు. దీంతో స్థానికులకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. అలాగే రెండవ వార్డులో ప్రజల సౌకర్యార్థం నూతన విద్యుత్ స్థంభాన్ని ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపించారు.

గ్రామంలోని గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, ప్రజలతో స్నేహపూర్వకంగా మమేకమవుతూ భరోసా కల్పించడం సాయికుమార్ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే గ్రామ ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

చిన్న వయసులోనే సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి ప్రజా శ్రేయసే లక్ష్యంగా పనిచేస్తున్న సాయికుమార్‌కు గ్రామ పెద్దలు, యువత, ప్రజలు మేము నీవెంటే అంటూ మద్దతు ప్రకటిస్తున్నారు.

Sthanikam

సొంత నిధులతో గ్రామాభివృద్ధికి దూసుకెళ్తున్న యువ సర్పంచ్

Article Image

మీ స్పందన? 7 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News