Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:30 PM

వెల్లంకిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్

09-07-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రామన్నపేట, జూలై 9: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన ఎస్.కె. జానీ మీయా ఇంటి ముందు కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు రామన్నపేట సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. సతీష్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది ఎం. వెంకటేశ్వర్లు, నరసింహ, రాఘవేందర్, కృష్ణమూర్తిలతో కూడిన బృందం బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆకస్మికంగా దాడి నిర్వహించింది.పోలీసులను గమనించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, సిబ్బంది చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని గోదుమల సంగప్ప, కొయ్యలకారి రాజు, కొయ్యలకారి రాము, ఎస్.కె. జానీ మీయాలుగా గుర్తించారు.నిందితుల వద్ద నుంచి రూ.1,800 నగదు, రెండు సెట్ల పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ జి. సతీష్ వెల్లడించారు.

Sthanikam

వెల్లంకిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News