Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:11 PM

ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు ఐక్య పోరాటం

ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు ఐక్య పోరాటం

ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
08-07-2026 243 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* రాష్ట్ర ఫోరం పిలుపు.. భువనగిరిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం

​* సూర్కంటి శ్రీధర్ రెడ్డి మందోళ్ల గూడెం ఉపసర్పంచ్. ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు

గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్‌ల హక్కులు, అధికారాల సాధన కోసం రానున్న రోజుల్లో ఐక్యంగా పోరాటాలు కొనసాగిస్తామని ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర సమీపంలోని హోటల్ సంకల్పలో ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మందోళ్లగూడెం ఉపసర్పంచ్, ఫోరం జిల్లా అధ్యక్షుడు సూర్కంటి శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించారు.​ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ మాట్లాడుతూ.. ఇటీవల జూన్ 25న నిర్వహించిన "హలో ఉపసర్పంచ్ – చలో హైదరాబాద్" కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాష్ట్రవ్యాప్త ఉపసర్పంచ్‌లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ కార్యక్రమం ఇచ్చిన స్ఫూర్తితోనే మున్ముందు హక్కుల సాధనకై కదలిరావాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఉపసర్పంచ్‌కు ఫోరం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మజ్జిగ నరేష్, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కటికం స్వప్న, దుస్సా కుమార్, జంపన్న, మట్ట శ్రీను, చిన్నం బాల్‌రాజు, జిల్లా నాయకులు దండ నరేష్, మహేష్, రాజు, ప్రవీణ్, అనిల్, స్వామి, హరీష్, ప్రదీప్, విజయ్, భాస్కర్ నాయక్, వీరన్న, మండల ఫోరం అధ్యక్షులు గొడటి సత్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు ఐక్య పోరాటం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News