Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:56 AM

జూలై 10 విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలి: ఎస్ఎఫ్ఐ

08-07-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూలై 8: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూలై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు.

బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని, విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి మహిళా సంఘాల ద్వారా అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈవో, డీఈవో, లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే చట్టాన్ని అమలు చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని కోరారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి జీఓ నెం. 7, 8, 9లను రద్దు చేయాలని, ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి, అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.

జూలై 10న జరిగే విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు పెద్ద అక్షిత, మండల నాయకులు లోకేష్, అభిరూప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జూలై 10 విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలి: ఎస్ఎఫ్ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News