Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

చిట్యాలలో అరుదైన ఘటన.. రూ.10 కాయిన్లతో స్ప్లెండర్ ప్లస్ కొనుగోలు

07-07-2026 784 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి వినూత్నంగా నూతన ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. చిట్యాల పట్టణంలోని శ్రీ వినాయక మోటార్స్‌లో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను కొనుగోలు చేసిన ఆయన, వాహనం ధరకు సంబంధించిన మొత్తం రూ.1,10,000 నగదును రూ.10 కాయిన్ల రూపంలో చెల్లించారు.

ఈ సందర్భంగా శ్రీ వినాయక మోటార్స్ నిర్వాహకుడు ఉప్పు మధు మాట్లాడుతూ, కస్టమర్ మొత్తం చెల్లింపును రూ.10 నాణేల రూపంలో అందజేశారని తెలిపారు. నాణేలను లెక్కించేందుకు కొంత సమయం పట్టినప్పటికీ, చెల్లుబాటు అయ్యే కరెన్సీ కావడంతో వాటిని స్వీకరించినట్లు చెప్పారు.సాధారణంగా పెద్ద మొత్తాల లావాదేవీలు నగదు లేదా డిజిటల్ చెల్లింపుల ద్వారా జరుగుతుండగా, ఒకేసారి లక్షకు పైగా మొత్తాన్ని రూ.10 కాయిన్ల రూపంలో చెల్లించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను చూసిన పలువురు ఆసక్తిగా వీక్షించగా, రఘుపతి తీసుకున్న నిర్ణయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

స్థానికంగా ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లోనూ చర్చకు దారి తీస్తుండగా, భారీ మొత్తంలో నాణేలతో బైక్ కొనుగోలు చేసిన ఘటన అరుదైన ఉదాహరణగా నిలిచింది.

Sthanikam

చిట్యాలలో అరుదైన ఘటన.. రూ.10 కాయిన్లతో స్ప్లెండర్ ప్లస్ కొనుగోలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News