Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

పూర్తయిన జర్నలిస్టుల ఇళ్లకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్‌కు వినతి

07-07-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు వెంటనే ఇంటి నంబర్లు కేటాయించి, పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం జర్నలిస్టులు సబ్ కలెక్టర్ ఉమ హారతికి వినతిపత్రం సమర్పించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న జర్నలిస్టుల కాలనీలో పలువురు తమ సొంత ఖర్చులతో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ బిల్లులు మంజూరు కాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అలాగే కాలనీలో రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించి కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ ఉమ హారతి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అమృత్, శ్రీకాంత్, పుండరీకం, మధుసూదన్, ఖైసర్, గోవర్ధన్, శ్రీనివాస్, రమేష్, మజహర్ ఖాన్ చిస్తీ, సంగప్ప, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పూర్తయిన జర్నలిస్టుల ఇళ్లకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్‌కు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News