Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:05 AM

ఆర్థిక స్వావలంబనకు మహిళలు ముందుకు రావాలి. యూత్ ఫర్ సేవా కుట్టుమిషన్ శిక్షణ. కొత్త బ్యాచ్ ఓరియంటేషన్‌లో రిటైర్డ్ ప్రిన్సిపల్ సుధారాణి

07-07-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ

మహిళలు ఆర్థిక పరమైన అంశాల్లో భాగస్వాములు కావడం ద్వారా కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలవగలరని రిటైర్డ్ ప్రిన్సిపల్, యూత్ ఫర్ సేవా చాప్టర్ అడ్వైజరీ సభ్యురాలు సుధారాణి అన్నారు. యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టుమిషన్ శిక్షణ తరగతుల నూతన బ్యాచ్ ఓరియంటేషన్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన సుధారాణి మాట్లాడుతూ మహిళా సాధికారతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని శిక్షార్థులకు సూచించారు.

యూత్ ఫర్ సేవా చాప్టర్ కోఆర్డినేటర్ నాగేంద్ర మాట్లాడుతూ సంస్థ దేశవ్యాప్తంగా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. శిక్షణ కేంద్రం ట్రైనర్ నాగమణి మాట్లాడుతూ ఇప్పటివరకు ఐదు బ్యాచ్లను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. శిక్షణ పొందిన వారిలో పలువురు సొంతంగా బుటిక్‌లు ఏర్పాటు చేసుకోగా, మరికొందరు ప్రముఖ బుటిక్‌లలో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుత బ్యాచ్ శిక్షార్థులు కూడా శిక్షణను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి సాధించి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని ఆకాంక్షించారు

Sthanikam

ఆర్థిక స్వావలంబనకు మహిళలు ముందుకు రావాలి. యూత్ ఫర్ సేవా కుట్టుమిషన్ శిక్షణ. కొత్త బ్యాచ్ ఓరియంటేషన్‌లో రిటైర్డ్ ప్రిన్సిపల్ సుధారాణి

Article Image

నల్గొండ

మహిళలు ఆర్థిక పరమైన అంశాల్లో భాగస్వాములు కావడం ద్వారా కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలవగలరని రిటైర్డ్ ప్రిన్సిపల్, యూత్ ఫర్ సేవా చాప్టర్ అడ్వైజరీ సభ్యురాలు సుధారాణి అన్నారు. యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టుమిషన్ శిక్షణ తరగతుల నూతన బ్యాచ్ ఓరియంటేషన్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన సుధారాణి మాట్లాడుతూ మహిళా సాధికారతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని శిక్షార్థులకు సూచించారు.

యూత్ ఫర్ సేవా చాప్టర్ కోఆర్డినేటర్ నాగేంద్ర మాట్లాడుతూ సంస్థ దేశవ్యాప్తంగా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. శిక్షణ కేంద్రం ట్రైనర్ నాగమణి మాట్లాడుతూ ఇప్పటివరకు ఐదు బ్యాచ్లను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. శిక్షణ పొందిన వారిలో పలువురు సొంతంగా బుటిక్‌లు ఏర్పాటు చేసుకోగా, మరికొందరు ప్రముఖ బుటిక్‌లలో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుత బ్యాచ్ శిక్షార్థులు కూడా శిక్షణను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి సాధించి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని ఆకాంక్షించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News