Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:04 AM

చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం కావాలి. డీసీఎంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్ జెల్లా వెంకటేష్.

07-07-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

చేనేత సహకార సంఘాల అభివృద్ధితో పాటు చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ నూతన పాలకవర్గం బాధ్యతాయుతంగా పనిచేయాలని డీసీఎంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్ జెల్లా వెంకటేష్ సూచించారు.

టెర్రీ కాటన్ చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ సభ్యులను మంగళవారం శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంఘం అభివృద్ధికి ప్రతి సభ్యుడు సమష్టిగా కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను చేనేత కార్మికులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.

సంఘం అధ్యక్షుడిగా పెండెం వేణు, ఉపాధ్యక్షుడిగా వనం నరసింహ, కార్యదర్శిగా దొంత నాగరాజు ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా గంజి సువర్ణ, సూర్యపెల్లి లావణ్య, అప్పం సంతోష్, పెండెం భావనారుషి, బోడ యాదగిరి, వనం సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు.

ఎన్నికల అధికారిగా కె. సురేష్ వ్యవహరించి, నూతన పాలకవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం కావాలి. డీసీఎంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్ జెల్లా వెంకటేష్.

Article Image

రామన్నపేట

చేనేత సహకార సంఘాల అభివృద్ధితో పాటు చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ నూతన పాలకవర్గం బాధ్యతాయుతంగా పనిచేయాలని డీసీఎంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్ జెల్లా వెంకటేష్ సూచించారు.

టెర్రీ కాటన్ చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ సభ్యులను మంగళవారం శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంఘం అభివృద్ధికి ప్రతి సభ్యుడు సమష్టిగా కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను చేనేత కార్మికులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.

సంఘం అధ్యక్షుడిగా పెండెం వేణు, ఉపాధ్యక్షుడిగా వనం నరసింహ, కార్యదర్శిగా దొంత నాగరాజు ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా గంజి సువర్ణ, సూర్యపెల్లి లావణ్య, అప్పం సంతోష్, పెండెం భావనారుషి, బోడ యాదగిరి, వనం సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు.

ఎన్నికల అధికారిగా కె. సురేష్ వ్యవహరించి, నూతన పాలకవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News