Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:19 PM

ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరేట్‌ను ముట్టడించిన ఎస్‌ఎఫ్‌ఐ

06-07-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, జూలై 6: ప్రభుత్వ పాఠశాలల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించింది. అనంతరం పరిపాలన అధికారి అంజిరెడ్డికి వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు, జిల్లా కార్యదర్శి లావుడియా రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదని తెలిపారు. జిల్లాలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ప్రతిపాదనను ఉపసంహరించుకుని జనాభా ప్రాతిపదికన కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించి నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల రాహుల్, సహాయ కార్యదర్శులు తిగుల్ల శ్రీనివాస్, పుట్టల ఉదయ్, జిల్లా కమిటీ సభ్యులు నేహాల్, ప్రసన్న, ఉదయ్, అరవింద్, లత, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరేట్‌ను ముట్టడించిన ఎస్‌ఎఫ్‌ఐ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News