Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేనేత సహకార సంఘం డైరెక్టర్‌గా సాయినేత ఏకగ్రీవ ఎన్నిక నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 06, 2026 06:47 PM

గత ఐదు నెలల్లో 270 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగింపు

గత ఐదు నెలల్లో 270 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగింపు

గత ఐదు నెలల్లో 270 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగింపు
July 06, 2026 04:33 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా,పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ రూ.29 లక్షల విలువైన 141 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ అత్యంత ముఖ్యమైన సాధనంగా మారిందని, అందువల్ల దానిని ఎల్లప్పుడూ జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు.

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న మరియు చోరీ కేసులకు సంబంధించి CEIR పోర్టల్, IMEI నంబర్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు తెలిపారు. గత ఐదు నెలల్లో మొత్తం 270 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేయడం జరిగిందన్నారు.

మొబైల్ ఫోన్‌ను ఎల్లప్పుడూ భద్రంగా ఉంచుకోవాలని, బస్టాండ్లు, మార్కెట్లు, షాపింగ్ ప్రాంతాలు, బస్సు ప్రయాణాల్లో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని సూచించారు. మొబైల్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. బిల్లు లేదా సరైన పత్రాలు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయరాదని హెచ్చరించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, కుటుంబ ఫోటోలు వంటి విలువైన డేటా రక్షణ కోసం వెంటనే ఫోన్‌ను బ్లాక్ చేయించుకోవాలని సూచించారు.

ఇంటి దొంగతనాల నివారణకు LHMS...

ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. పండుగలు లేదా ఇతర అవసరాల కోసం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే వారు Lock House Monitoring System (LHMS) యాప్‌లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. కనీసం ఒక రోజు ముందుగానే యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందితే, పోలీసు సిబ్బంది ఇంటి వద్ద సెన్సార్ కెమెరాలను ఏర్పాటు చేస్తారని వివరించారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో కెమెరా ముందు ఏదైనా కదలిక జరిగిన వెంటనే కంట్రోల్ రూమ్‌కు అలారం చేరుతుందని, ఆ సమాచారం అందిన వెంటనే సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు బృందాలు అప్రమత్తమై మూడు నుంచి నాలుగు నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో ఇంటి దొంగతనాలను సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సేవ కోసం ప్రజలు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదని, యాప్ ద్వారా సమాచారం ఇవ్వడమే సరిపోతుందని స్పష్టం చేశారు.

బాధితుల ఆనందం...

తమకు ఎంతో విలువైన మొబైల్ ఫోన్లు తిరిగి అందడంతో 141 మంది బాధితులు జిల్లా ఎస్పీ గారికి, సైబర్ క్రైమ్ విభాగానికి, క్యాట్ టీం పోలీస్ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ

మొబైల్ ఫోన్ల రికవరీలో విశేష కృషి చేసిన ఐటీ కోర్–సైబర్ క్రైమ్ క్యాట్ టీం విభాగం, సీఐలు గోపీనాథ్ రెడ్డి, సతీష్ కుమార్, పోలీస్ సిబ్బంది చంద్ర, శ్రీనివాసులు, షమీర్, సీసీఎస్ సిబ్బంది కృష్ణానాయక్, నరసింహమూర్తి తదితరులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ఐపీఎస్, సైబర్ క్రైమ్ సీఐ గోపీనాథ్ రెడ్డి, క్యాట్ టీం, సోషల్ మీడియా సిబ్బంది మరియు మొబైల్ ఫోన్లు పొందిన బాధితులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News