ల్యాండ్‌స్కేప్ రూపకల్పన విభాగంలో 49 సీట్లు ఖాళీ
సూర్యాపేట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోందని కళాశాల ప్రిన్సిపాల్ కె. సుజాత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ల్యాండ్‌స్కేప్ రూపకల్పన విభాగంలో ఇంకా 49 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ నెల 8వ తేదీ వరకు నేరుగా కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉందన్నారు.
విద్యార్థినులకు వసతి గృహ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9866385292, 9394744491 నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి