Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:20 PM

దుర్వాసన, ఈగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు. కలెక్టర్‌కు గ్రామస్తుల వినతిపత్రం

06-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జర్పుల తండాలో కోళ్ల ఫారం తొలగించాలి

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం జర్పుల తండా గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న కోళ్ల ఫారాన్ని వెంటనే తొలగించాలని గ్రామ సర్పంచి రామ్‌లాల్ నాయక్, గ్రామ పెద్దలు జిల్లా కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి అత్యంత సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసిన కోళ్ల ఫారం వల్ల తీవ్రమైన దుర్వాసన, ఈగల సమస్య నెలకొన్నదని తెలిపారు. దీంతో గ్రామంలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భోజనం చేసే సమయంలో ఆహారంపై ఈగలు వాలడంతో పాటు చిన్నపిల్లలకు వాంతులు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ సమీపంలోని కోళ్ల ఫారాన్ని వెంటనే తొలగించి తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో జైపాల్, శంకర్, రాజు, రమేష్, సురేష్, సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దుర్వాసన, ఈగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు. కలెక్టర్‌కు గ్రామస్తుల వినతిపత్రం

Article Image

జర్పుల తండాలో కోళ్ల ఫారం తొలగించాలి

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం జర్పుల తండా గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న కోళ్ల ఫారాన్ని వెంటనే తొలగించాలని గ్రామ సర్పంచి రామ్‌లాల్ నాయక్, గ్రామ పెద్దలు జిల్లా కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి అత్యంత సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసిన కోళ్ల ఫారం వల్ల తీవ్రమైన దుర్వాసన, ఈగల సమస్య నెలకొన్నదని తెలిపారు. దీంతో గ్రామంలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భోజనం చేసే సమయంలో ఆహారంపై ఈగలు వాలడంతో పాటు చిన్నపిల్లలకు వాంతులు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ సమీపంలోని కోళ్ల ఫారాన్ని వెంటనే తొలగించి తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో జైపాల్, శంకర్, రాజు, రమేష్, సురేష్, సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News