Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:35 AM

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

06-07-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు, జూలై 6: ఎమ్మిగనూరు పట్టణంలోని వ్యవసాయ ఎరువుల దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి, రైతులను మోసం చేస్తున్న ఫర్టిలైజర్ షాపులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన సేన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఎమ్మిగనూరు వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర మాట్లాడుతూ, పట్టణంలోని పలువురు ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుమందులు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అలాగే లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించడం, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, రైతులకు బిల్లులు ఇవ్వకుండా అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ అక్రమాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పంట దిగుబడులు తగ్గి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇటువంటి ఫర్టిలైజర్ దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అక్రమాలకు పాల్పడుతున్న షాపులను వెంటనే సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మండలంలోని అన్ని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నాణ్యత లేని వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాన్ని పూర్తిగా అరికట్టాలని వినతిపత్రంలో కోరారు.

ఈ కార్యక్రమంలో బహుజన సేన సమితి ఎమ్మిగనూరు నియోజకవర్గ కార్యనిర్వాహక సభ్యులు సూరి, ముని, కేశన్న, రాముడు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News