Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

మానవత్వం చాటిన స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్

01-07-2026 255 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వృద్ధుడికి అండగా నిలిచి ఆశ్రయ కేంద్రానికి తరలించిన పోలీసులు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్ వద్ద గత నాలుగు రోజులుగా అనాథలా తిరుగుతున్న వృద్ధుడు సుబ్రహ్మణ్యంను గుర్తించిన స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ మానవత్వంతో స్పందించారు.

వృద్ధుడిని కలిసి తన వంతుగా రూ.500 ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వెంటనే చౌటుప్పల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మన్మధకుమార్ కు సమాచారం అందించారు. సీఐ ఆదేశాల మేరకు పెట్రోలింగ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, డ్రైవర్ సైదులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడిని సురక్షితంగా చౌటుప్పల్ "అమ్మ నాన్న" ఆశ్రయ కేంద్రానికి తరలించారు.

అనంతరం వృద్ధుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, వారిని గుర్తించి సురక్షితంగా అప్పగించేలా చర్యలు చేపట్టాలని పెట్రోలింగ్ సిబ్బందికి సూచించినట్లు డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ తెలిపారు.

Sthanikam

మానవత్వం చాటిన స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్

Article Image

వృద్ధుడికి అండగా నిలిచి ఆశ్రయ కేంద్రానికి తరలించిన పోలీసులు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్ వద్ద గత నాలుగు రోజులుగా అనాథలా తిరుగుతున్న వృద్ధుడు సుబ్రహ్మణ్యంను గుర్తించిన స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ మానవత్వంతో స్పందించారు.

వృద్ధుడిని కలిసి తన వంతుగా రూ.500 ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వెంటనే చౌటుప్పల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మన్మధకుమార్ కు సమాచారం అందించారు. సీఐ ఆదేశాల మేరకు పెట్రోలింగ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, డ్రైవర్ సైదులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడిని సురక్షితంగా చౌటుప్పల్ "అమ్మ నాన్న" ఆశ్రయ కేంద్రానికి తరలించారు.

అనంతరం వృద్ధుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, వారిని గుర్తించి సురక్షితంగా అప్పగించేలా చర్యలు చేపట్టాలని పెట్రోలింగ్ సిబ్బందికి సూచించినట్లు డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News