Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:28 PM

సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపు

30-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, జూన్ 30: జూలై 4, 5, 6 తేదీలలో భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి శ్రీనివాస (దివ్య) ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు.

మంగళవారం భువనగిరిలోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన సీపీఎం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందన్నారు.

అలాగే ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) పేరుతో చేపడుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజల ఓటు హక్కులను హరించేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఎస్‌ఐఆర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై కార్యకర్తలకు రాజకీయ అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తరగతులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి. జహంగీర్, రాష్ట్ర నాయకుడు బండారి రమేష్ తదితరులు బోధిస్తారని తెలిపారు.

ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేష్, కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News