Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

శివాలయంలో చోరీ.. హుండీతో పాటు బంగారం, వెండి వస్తువులు మాయం

30-06-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అనుముల, నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా అనుముల మండలం హజారిగూడెం గ్రామంలోని శివాలయంలో అర్ధరాత్రి చోరీ చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి హుండీతో పాటు విలువైన బంగారు, వెండి ఆభరణాలను అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు.దుండగులు ఆలయంలో ఉన్న వెండి చెంబులు, వెండి ప్లేట్, అమ్మవారికి అలంకరించిన తులం బంగారు పుస్తెలు, హుండీ నగదు సహా ఇతర పూజా సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు తాళాలు ధ్వంసమైనట్లు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు.

ఘటన తెలిసిన వెంటనే గ్రామ పెద్దలు, భక్తులు ఆలయానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్ర దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడటం బాధాకరమని వారు పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన వస్తువుల విలువ, ఇతర వివరాలపై విచారణ కొనసాగుతోంది. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

దేవాలయాల్లో వరుస చోరీలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తుండగా, హజారిగూడెం ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Sthanikam

శివాలయంలో చోరీ.. హుండీతో పాటు బంగారం, వెండి వస్తువులు మాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News