Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:52 AM

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన పరిగి పోలీసులు

29-06-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పరిగి, జూన్ 29: పరిగి మండలం ఊటకూరు గ్రామ సమీపంలోని జయమంగళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో పరిగి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్సై రవికుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం నది పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.

ఈ తనిఖీల్లో రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు నిలిపివేసి వాటి అనుమతి పత్రాలను పరిశీలించారు. అనుమతులు ఉన్నప్పటికీ, ఇసుకను అనుమతించిన ప్రాంతానికే తరలిస్తున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ట్రాక్టర్ల వెంట వెళ్లి రవాణాను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

Sthanikam

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన పరిగి పోలీసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News