Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:27 PM

ముందు నేనే కడతా... తర్వాత ప్రజలను అడుగుతా..! తెలంగాణకు ఆదర్శమంటూ ప్రశంసలు.

29-06-2026 145 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆచరణే ఆదర్శం.. రూ.11,251 పన్ను స్వయంగా చెల్లించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్.

పన్నులు కట్టాలని ప్రజలకు చెప్పే ముందు.. తానే ముందుగా ఆచరించి చూపించారు ఎల్లంకి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామానికి చెందిన ఆయన తన ఇంటికి సంబంధించిన రూ.11,251 ఇంటి పన్నును స్వయంగా చెల్లించి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు.

ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలంటే ముందుగా ప్రజాప్రతినిధులే బాధ్యతగా తమ పన్నులు చెల్లించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్యపై గ్రామస్తులు, స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ, "తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయం ఇది" అని అభిప్రాయపడుతున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఇంటి పన్నులు ప్రధాన ఆధారమని చెప్పారు. ప్రతి ఇంటి యజమాని సకాలంలో పన్నులు చెల్లిస్తే గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు, వీధి దీపాలు, రహదారులు వంటి అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

"ప్రజలకు చెప్పే ముందు ప్రజాప్రతినిధులే ఆచరించాలి.. అప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

Sthanikam

ముందు నేనే కడతా... తర్వాత ప్రజలను అడుగుతా..! తెలంగాణకు ఆదర్శమంటూ ప్రశంసలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News