Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చలో అసెంబ్లీ’కి బయలుదేరిన బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 12:23 PM

50 ఏళ్లైనా డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ప్రజల దుర్భర జీవనం – జల్లెల పెంటయ్య

28-06-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Hyderabad
Alpha Raw

దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దళిత కాలనీలు మాత్రం ఇప్పటికీ కనీస మౌలిక వసతులకు నోచుకోక అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జల్లెల పెంటయ్య విమర్శించారు.

రామన్నపేట మండలం నీర్నేముల గ్రామంలోని దళిత కాలనీలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో పలు సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీ ఏర్పడి దాదాపు 50 ఏళ్లు గడిచినా ఇప్పటికీ శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

డ్రైనేజీ కాలువలు లేక ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు వీధుల్లోనే నిలిచిపోతుండటంతో కాలనీలు బురదమయంగా మారాయని, ప్రజలు నడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిల్వ నీటి కారణంగా దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అర శతాబ్దం చరిత్ర కలిగిన దళిత కాలనీపై ఈ స్థాయి నిర్లక్ష్యం, వివక్ష తగదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన శాశ్వత డ్రైనేజీ వ్యవస్థతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు, మాజీ ఎంపీపీ నాగటి ఉపేందర్, పార్టీ సీనియర్ నాయకులు బండ జగన్మోహన్ రెడ్డి, బోయిని మల్లేష్, నేమనంది లింగయ్య, నాగటి మహేష్, ఏభూషి సాయిలు, నాగటి నరేష్, నోముల లక్ష్మమ్మ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

50 ఏళ్లైనా డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ప్రజల దుర్భర జీవనం – జల్లెల పెంటయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News