Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:33 PM

భువనగిరిలో పల్స్ పోలియోకు శ్రీకారం.. చిన్నారులకు చుక్కలు వేసిన ప్రజాప్రతినిధులు

28-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని హనుమన్వాడ బీడీకే (BDK)లో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. మనోహర్.. పుట్టినప్పటి నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పోలియో బూత్‌కు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని కోరారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామోదయ చైర్మన్ అవ్వేగె క్రిస్టఫర్, తుంగతుర్తి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగడపల్లి శ్రీవాణి, వైస్ చైర్మన్ పోతంశెట్టి మనోజ్ వెంకటేష్, కౌన్సిలర్ ఫషం అమర్, తుమ్మల నగేష్, మొహమ్మద్ యాస్మిన్, జె. వినోద్, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు వెంకట్ రెడ్డి, బాలాజీ, వైద్యులు డా. హరీష్, డా. వినీత్, డా. విఠలేష్‌తో పాటు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. అధికారులు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

భువనగిరిలో పల్స్ పోలియోకు శ్రీకారం.. చిన్నారులకు చుక్కలు వేసిన ప్రజాప్రతినిధులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News