Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:33 PM

హారతులు, అక్షింతలతో విద్యార్థులకు ఘన స్వాగతం.. వెంపటి ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా విద్యా సంవత్సరం ప్రారంభం

15-06-2026 427 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నూతన విద్యా సంవత్సరం సందర్భంగా తుంగతుర్తి మండలం వెంపటి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన జ్యోతులు వెలగాలని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయులు చిన్నారులను హారతులుహారతులు, అక్షింతలతో ఆశీర్వదించి తరగతి గదుల్లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. సరస్వతీ మాత చిత్రపటానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ విద్యార్థులను తరగతి గదుల్లోకి తీసుకెళ్లడంతో పాఠశాల ఆవరణ పండుగ వాతావరణాన్ని తలపించింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానో ఉపాధ్యాయులుభీవనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... గ్రామంలోని బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనీ చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామస్తుల సహకారం అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్నం భోజనం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లెపాక రవీందర్,

గట్టు మాధవి ,

నిమ్మరబోయిన నవీన ,

బండారు భవాని ,

జీడి అనిల్ కుమార్ ,

మిట్ట గడుపుల విక్రమ్ ,

మాలోతు కృష్ణ ,

గుండ్ల ఆంజనేయులు ,

రామనబోయిన మౌనిక ,

అబ్బ గాని మంజుల, పాల్గొన్నారు.

Sthanikam

హారతులు, అక్షింతలతో విద్యార్థులకు ఘన స్వాగతం.. వెంపటి ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా విద్యా సంవత్సరం ప్రారంభం

Article Image

నూతన విద్యా సంవత్సరం సందర్భంగా తుంగతుర్తి మండలం వెంపటి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన జ్యోతులు వెలగాలని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయులు చిన్నారులను హారతులుహారతులు, అక్షింతలతో ఆశీర్వదించి తరగతి గదుల్లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. సరస్వతీ మాత చిత్రపటానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ విద్యార్థులను తరగతి గదుల్లోకి తీసుకెళ్లడంతో పాఠశాల ఆవరణ పండుగ వాతావరణాన్ని తలపించింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానో ఉపాధ్యాయులుభీవనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... గ్రామంలోని బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనీ చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామస్తుల సహకారం అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్నం భోజనం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లెపాక రవీందర్,

గట్టు మాధవి ,

నిమ్మరబోయిన నవీన ,

బండారు భవాని ,

జీడి అనిల్ కుమార్ ,

మిట్ట గడుపుల విక్రమ్ ,

మాలోతు కృష్ణ ,

గుండ్ల ఆంజనేయులు ,

రామనబోయిన మౌనిక ,

అబ్బ గాని మంజుల, పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News