Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:31 PM

చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

06-06-2026 399 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ, చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల శివారులో భువనగిరి రోడ్డుపై ఉన్న శ్రీ బాల నరసింహ స్వామి దేవస్థానం సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో టాటా ఏసీ వాహనం కారును ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల సమాచారం ప్రకారం, భువనగిరి వైపు నుంచి నల్గొండ దిశగా వస్తున్న రెండు వాహనాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ముందున్న వాహనాన్ని దాటేందుకు టాటా ఏసీ డ్రైవర్ ప్రయత్నించగా నియంత్రణ కోల్పోయి కారును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఢీకొన్న ప్రభావంతో కారు తీవ్రంగా దెబ్బతింది

.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడి వివరాలు, గాయపడిన వారి గుర్తింపు తదితర అంశాలు ఇంకా తెలియరాలేదు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

Sthanikam

చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News