Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

వలిగొండ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ

05-06-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్‌స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అక్షణష్ యాదవ్ శుక్రవారం వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యూనిఫాం, వ్యక్తిగత సామగ్రి, రికార్డుల నిర్వహణ, స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు.

అనంతరం జనరల్‌ డైరీ, హెల్ప్‌డెస్క్‌, కోర్టు రికార్డు గది, ఎవిడెన్స్‌ ప్రాపర్టీల నిర్వహణను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పెండింగ్‌, నమోదైన పిటిషన్ల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్‌, సీఐఎస్‌ఆర్‌ పోర్టళ్ల పనితీరును సమీక్షించి, సైబర్‌ నేరాలకు సంబంధించిన పాత కేసుల వివరాలను పరిశీలించారు.

లాక్‌అప్‌ గది, సీసీటీవీ కెమెరాల పనితీరును తనిఖీ చేసిన ఎస్పీ, రౌడీషీటర్ల రికార్డులను పరిశీలించి వారి ప్రవర్తనపై ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఉన్న స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించి, వాటికి సంబంధించిన క్రైం నంబర్లు నమోదు చేసి క్రమబద్ధంగా ఉంచాలని సూచించారు.

తనిఖీలో చౌటుప్పల్‌ డీఎస్పీ మధుసూదన్‌, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ యుగేందర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

వలిగొండ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News