Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

మనవడి కళ్లెదుటే తాత విషాద అంతం: బైక్ పక్కకు ఆపి స్పృహతప్పిన కార్పెంటర్

23-05-2026 483 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం వృద్ధుడు ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందాడు. మనవడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ శంకరయ్య (65) వృత్తిరీత్యా కార్పెంటర్. శనివారం మధ్యాహ్నం ఆయన తన వ్యక్తిగత పని నిమిత్తం మనుమడు మొకరోజు మణికంఠతో కలిసి బైక్ (TS 30 K 8907) పై చౌటుప్పల్ వచ్చారు. పని ముగించుకుని తిరిగి గ్రామానికి బయలుదేరారు.​మార్గమధ్యలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో లింగారెడ్డిగూడెం గ్రామ పరిధిలోని మార్లమైసమ్మ గుడి ఆర్చ్ సమీపానికి చేరుకోగానే, శంకరయ్యకు ఒక్కసారిగా కళ్ళు తిరగడం ప్రారంభమైంది. వెంటనే వెనుక కూర్చున్న మనవడికి "కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది" అని చెబుతూ బైక్‌ను రోడ్డు పక్కకు ఆపారు. వాహనం ఆపిన కొద్దిసేపటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు.​కంగారుపడిన మనవడు స్థానికుల సహాయంతో వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. శంకరయ్యను అత్యవసరంగా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరీక్షించిన డ్యూటీ డాక్టర్.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు దేవరకొండ శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

మనవడి కళ్లెదుటే తాత విషాద అంతం: బైక్ పక్కకు ఆపి స్పృహతప్పిన కార్పెంటర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News